27, డిసెంబర్ 2024, శుక్రవారం

తిరుప్పావై - పాశురము 13 - పుళ్ళిన్ వాయ్ కీణ్డానై

తిరుప్పావై 13వ పాశురము లో తుమ్మెదల వంటి అందమైన నల్లటి నేత్ర సౌందర్యము కలిగిన ఇంకో కన్యను వ్రతము చేయడం కోసమని లేపుతూ "నీ కోసమని మిగతా వారినందరినీ వెళ్లిపోకుండా కలిసి వెళదామని ఆపి మరి వచ్చాము" అని గోదాదేవి వివరిస్తోంది.  

తిరుప్పావై 13వ పాశురము 



పుళ్ళిన్ వాయ్ కీణ్డానై పొల్లావరక్కనై 
క్కిళ్ళి కళైన్ దానై క్కీర్తిమై పాడి ప్పోయ్ 
పిళ్ళై గ ళెల్లారుమ్ పావై క్కళమ్ బుక్కార్,
వెళ్లి యెళున్దు వియాళ ముఱంగిత్తు;
పుళ్ళుమ్ శిలంబినకాణ్ పోదరి కణ్ణినాయ్ !
కుళ్ళ కుళిర క్కుడైన్దు నీరాడాదే
పళ్ళిక్కిడ త్తియో పావాయ్ నీ! నన్నాళాల్ 
కళ్ళం తవిరందు కలందు ఏలోరెమ్బావాయ్ ||   



అర్థము :-

ఓ పిల్లా! మన జట్టులోని పిల్లలంతా కూడ బకాసురిని ముక్కు చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని, అదే కృష్ణుడు రామునిగా ఉన్నప్పుడు అతి సునాయాసంగా రావణుడనే రాక్షసుని తన బాణముల ద్వారా నరికి చంపిన వీరగాధలను కీర్తిస్తూ వ్రతము కోసము నిర్ధారించబడిన స్నానశాలకు వెళ్లిపోయారు. ఇదిగో మేము ఇద్దరు, ముగ్గురమే నీకోసమని వచ్చాము. 

తెల్లవారుతోందని చెప్పటానికి శుక్ర నక్షత్రము ఉదయిస్తోంది. బృహస్పతి నక్షత్రము అస్తమించింది. (పక్షులు కూడ ఆహారము కోసమని బయలుదేరి తిరుగుతున్నాయి)

జింక కళ్ళ లాంటి కళ్ళు, తుమ్మెదల వంటి అందమైన, సొగసైన నేత్ర సౌందర్యాన్ని పొందినదానా! చల్లటి నీటిలో మాతో కూడి స్నానం చెయ్యకుండా నిద్రపోతున్నావా! ఆ కపట చర్యలు మాని వెంటనే లేచి మాతో కలిసి వ్రతము ఆచరించడానికి రా! అని ఆ ఎనిమిదో బాలికను కూడ లేపారు.    
     
   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి