25, డిసెంబర్ 2024, బుధవారం

తిరుప్పావై పాశురము - 10

తిరుప్పావై 10వ పాశురములో గోదాదేవి మరో ద్వారము దగ్గరకి వెళ్లి నోములు నోచి శ్రీకృష్ణ కటాక్షము పొందిన ఇంకో గోపికను లేపుతోంది. ఆ బాలిక కూడ కృష్ణుని అనుభవంలో అతి దీర్ఘ నిద్రలో ఉండి తలుపులు తెరవడం లేదని ఆ నిద్రని కుంభకర్ణుని నిద్రతో పోలుస్తోంది. 
 


  
నోట్రు స్సువర్గం పుకుకిన్ఱ వమ్మానాయ్ !
మాత్ర ముంతారారో వాశల్ తిఱవాదార్ 
నాత్త త్తుళాయ్ ముడి నారాయణన్, నమ్మాల్ 
పోత్త పఱై తరుమ్ పుణ్ణియనాల్, పండొరునాల్ 
కూత్తత్తిన్, వాయ్ వీళన్ద కుంబకరణ నుమ్ 
తోత్తుమ్ ఉనక్కే పెరుంతుయిల్ తాన్ తందానో 
ఆత్త వనన్దలు డైయాయ్ ! అరుంగలమే!
తేత్తమాయ్ వందు తిఱవే లోరెమ్బావాయ్ ||           


అర్థము :- 

ఓ తల్లీ, నోములు నోచి వైభవాన్ని పొందిన నువ్వు అందరికీ చెందాల్సిన ఆ శ్రీకృష్ణ పరమాత్మని నువ్వు ఒక్క దానివే అనుభవిస్తున్నావా! (ఎంత స్వార్ధపరురాలివమ్మా). తలుపులు తెరవకపోతే మానె కనీసం ఒక్క పలుకైనా పలుకవచ్చును కదా ! 

నెమలి పింఛము, తులసీమాలలు ధరించిన ఆ శ్రీమన్నారాయణుడిని కీర్తించినతో ఆ పుణ్యఫలంగా మనము కోరిన ఆ పఱై అనే బహుమానాన్ని ఇస్తాడు. లేచి రావేమిటి?

ఇంతకు ముందు శ్రీ రాముని కాలంలో వధించబడిన ఆ కుంభకర్ణుడు నీతో పోటీకి దిగి నిన్ను ఓడించలేక తన నిద్రను కూడ నీకే ఇచ్చేశాడా ఏమిటి? మరీ అంత నిద్ర ఏమిటమ్మా! తొందరగా లేచి రా. 

మాకందరికీ శిరోభూషణము లాంటి దానివి నువ్వు. కంగారుపడకుండా జాగ్రత్తగా మెలకువ తెచ్చుకుని లేచి వచ్చి తలుపు తియ్యి అని ఆ కన్యను కూడ తమ జట్టులో జేర్చుకున్నారు.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి