తిరుప్పావు - పాశురము 12
కనైత్తిళం కత్తెఱుమై కన్రు క్కిరంగి
నినైత్తు ములై వళియే నిన్ఱు పాల్ శోర
ననైత్తిల్లమ్ శేఱాక్కుమ్ నర్చెల్వన్ తంగాయ్ !
వనిత్తలై నీఙ , నిన్-వాశల్ కడై పత్తి !
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై శెత్త
మనత్తు క్కిని యానై పాడవుమ్ నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎళున్దిరాయ్ ఈదెన్న పేరురక్కమ్
అనైత్తిల్ల త్తారుమ్ అఱిందేలోర్ ఎమ్బావాయ్ ||
అర్థము :-
ఇక్కడ సన్నివేశము ఏమిటంటే ఆండాళ్ తక్కిన కన్యలు కూడ పొద్దు పొడవకముందే వ్రతం చెయ్యటానికి బయలుదేరారు కదా . ఇంకా చీకటిగానే ఉంటుంది. గొల్లవారంతా పాలు పితికే ముందు లాంతర్ల గుడ్డి దీపంలో పశువుల గొట్టంలో చేరి ముందుగా ఆవులు, గేదెలను శుభ్రంగా కడగడం,కాని, తడి బట్టలతో తుడవడం గాని చేస్తారు. అప్పుడు ఆహారము పెట్టి, ఆ తర్వాత పాలు పితికే ముందు లేగ దూడలని పాలు తాగడానికి వదులుతారు.
ఇప్పుడే దూడలని వదలడం బాకీ ఉందన్నమాట. అలా రెడీగా తయారై ఉన్న పశువులు ఎదురుకుండా దూరంలో కట్టెశబడి ఉన్న దూడలను చూస్తూ మమకారము పొంగిపొర్లుతుండగా అవి దగ్గరకి వచ్చి పాలు తాగుతున్నాయి అన్న అనుభూతితో పొదుగుల నుండి పాలు కార్చేస్తున్నాయిట.
అలా కారుతున్న పాలు వాగులు కట్టి ప్రవహిస్తూ ఇంటి ముంగిటనంతా తడిపేస్తుంటే అంతా బురదమయం అయిపొయింది. అటువంటి బురదలోంచి ఆ బాలికలు వాకిట వరకు ఎల్లాగోల్లా తంటాలు పడుతూ జేరి, మంచు పడుతూ చలి వేస్తోంటే ఆ మంచి నుండి రక్షించుకోడానికి గుమ్మాలు పట్టుకుని వేలాడుతున్నారుట.
గుమ్మాలు కాస్త ఇరుకుగానే ఉండి అందరూ తలదాచుకోడానికి ఇబ్బందికరంగా ఉండి ఉండవచ్చును. అందుచేత ఇరుక్కుని నుంచుంటే పడిపోకుండా గుమ్మాల చూరు పట్టుకున్నారేమో అంతా.
ఇలా ఇంతగా తంటాలు పడుతూ నిన్ను లేపడానికి వస్తే ఓ మానవ శ్రేష్ఠుని ముద్దు చెల్లెలా! ఇన్ని అవస్థలు పడుతూ కూడా మేము అప్పుడు ఎప్పుడో రామాయణ కాలంలో తన భార్య సీతను అపహరించాడన్న కోపంతో పట్టు పట్టి రావణాసురుడిని వధించిన శ్రీరామచంద్ర మూర్తి నామస్మరణ చేస్తుంటే కొంచమైనా పట్టించుకోకుండా, నోరు విప్పకుండా అలా నిద్రపోతున్నావేమిటి?
ఇది ఎక్కడి ఘోరమైన నిద్ర? చుట్టుపక్కల వారంతా కూడ విని నవ్వుకుంటున్నారు. లేచి రావమ్మా!
ఇంత జరిగాక ఆ బాలిక లేస్తే అక్కడినుండి ఇంకో ఇంటికి వెళతారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి