శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి అంటే తిరుపతి వేంకటేశ్వరుని 108 నామాలు అన్నమాట. సాధారణముగా మనలో చాలామంది ప్రత్యేకముగా శనివారము రోజున ఆ ఏడుకొండల స్వామిని 108 పేర్లతో కొలుచుచూ, కుంకుమ, పువ్వులు సమర్పించుకుంటూ పూజించుకుంటాము.
తెల్లవారు ఝామున సుప్రభాతము మొత్తము 4 అధ్యాయములూ రాగయుక్తముగా చదువుకోవడమూ, సాయంత్రము కుంకుమ పువ్వులతో 108 నామాలు చదవడమూ చేసుకోవచ్చును.
ఇప్పుడు 108 నామాలు తెలుపుతున్నాను. ఇవి నా వద్ద ఉన్న ఒక వైష్ణవ పూజా పుస్తకము ప్రకారము తెలియజేస్తున్నాను.
వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి
- ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః
- ఓం శ్రీ శ్రీనివాసాయ నమః
- ఓం శ్రీ లక్ష్మీపతయే నమః
- ఓం అనామయాయ నమః (వ్యాధులు లేనివాడు)
- ఓం అమృతాంశాయ నమః
- ఓం జగద్వంద్యాయ నమః
- ఓం గోవిందాయ నమః
- ఓం శాశ్వతాయ నమః
- ఓం ప్రభవే నమః (ప్రకాశము, లేదా జ్యోతిర్మయి)
- ఓం శేషాద్రి నిలయాయ నమః
- ఓం దేవాయ నమః
- ఓం కేశవాయ నమః (సుందరమైన, పొడవైన జటలు కలవాడు)
- ఓం మధుసూదనాయ నమః
- ఓం అమృతాయ నమః
- ఓం మాధవాయ నమః
- ఓం కృష్ణాయ నమః
- ఓం శ్రీహరయే నమః
- ఓం జ్ఞానపంజరాయ నమః
- ఓం శ్రీవత్సవక్షసే నమః
- ఓం సర్వేశాయ నమః
- ఓం గోపాలాయ నమః
- ఓం పురుషోత్తమాయ నమః
- ఓం గోపీశ్వరాయ నమః
- ఓం పరంజ్యోతిషే నమః (అపారమైన జ్యోతిర్మయుడు)
- ఓం వైకుంఠపతయే నమః
- ఓం అవ్యయాయ నమః (తరుగుదల లేనివాడు)
- ఓం సుధాతనవే నమః (అమృతదేహుడు, తానే అమృతము)
- ఓం యాదవేంద్రాయ నమః
- నిత్యయౌవన రూపవతే నమః
- ఓం చతుర్వేదాత్మకాయ నమః
- ఓం విష్ణవే నమః
- ఓం అచ్యుతాయ నమః
- ఓం పద్మినీప్రియాయ నమః
- ఓం ధరాపతయే నమః
- ఓం సురపతయే నమః
- ఓం నిర్మలాయ నమః
- ఓం దేవపూజితాయ నమః
- ఓం చతుర్భుజాయ నమః
- ఓం చక్రధరాయ నమః
- ఓం త్రిధామ్నే నమః (ముల్లోకవాసి)
- ఓం త్రిగుణాశ్రయాయ నమః (సత్త్వ, రజస్, తమోగుణములు)
- ఓం నిర్వికల్పాయ నమః (ద్వంద్వములు కాని సందేహములు కాని లేనివాడు)
- ఓం నిష్కళంకాయ నమః
- ఓం నిరాతంకాయ నమః (ఆతంకము, భయములు లేనివాడు)
- ఓం నిరంజనాయ నమః (దేనియందు ఆసక్తి లేనివాడు)
- ఓం నిరాభాసాయ నమః (ఉనికి లేనివాడు, కనబడని వాడు)
- ఓం నిత్యతృప్తాయ నమః
- ఓం నిరుపద్రవాయ నమః
- ఓం నిర్గుణాయ నమః
- ఓం గదాధరాయ నమః
- ఓం శార్ఙ్గ పాణయే నమః
- ఓం నందకినే నమః
- ఓం శంఖ ధారకాయ నమః
- ఓం అనేకమూర్తయే నమః
- ఓం అవ్యక్తాయ నమః (కనబడని వాడు)
- ఓం కటి హస్తాయ నమః (ఒక చేయి నడుముపై ఉంచుకొనువాడు)
- ఓం వరప్రదాయ నమః
- ఓం అనేకాత్మనే నమః
- ఓం దీన బంధవే నమః
- ఓం ఆర్తలోక అభయప్రదాయ నమః
- ఓం ఆకాశరాజ వరదాయ నమః
- ఓం యోగి హృత్పద్మ మందిరాయ నమః
- ఓం దామోదరాయ నమః
- ఓం జగత్ పాలాయ నమః
- ఓం పాపఘ్నాయ నమః (పాపములను నశింపజేయువాడు)
- ఓం భక్తవత్సలాయ నమః
- ఓం త్రివిక్రమాయ నమః (మూడు అడుగులతో ముల్లోకములనూ ఆక్రమించిన వాడు)
- ఓం శింశుమారాయ నమః (సప్త లోకములను ఆవరించి తేలు ఆకారములో ఉన్న విష్ణువు)
- ఓం జటామకుట శోభితాయ నమః (జటలను, వాటికి ఆభరణముగా ఒక కిరీటమును, అలంకరించుకున్నవాడు)
- ఓం శంఖ మధ్యోల్లసన్ మంజుకింకిణ్యాధ్య కరండకాయ నమః (శంఖముల లోపలి నుండి తీయబడిన ముత్యములతో తయారైన హారము ధరించువాడు)
- ఓం నీలమేఘశ్యామ తనవే నమః
- ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమః
- ఓం జగద్వ్యాపినే నమః
- ఓం జగత్ కర్త్రే నమః
- ఓం జగత్ సాక్షిణే నమః
- ఓం జగత్పతయే నమః
- ఓం చింతితార్థ ప్రదాయకాయ నమః (కోరుకున్న వరము లొసగువాడు)
- ఓం జిష్ణవే నమః (గెలుపొందు వాడు, పరాక్రమము వ్యాప్తి చెందినవాడు)
- ఓం దాశార్హాయ నమః (దాశార్హ వంశజుడు, దశరథ వంశజుడు)
- ఓం దశరూపవతే నమః (పది రూపములు ధరించినవాడు)
- ఓం దేవకీనందనాయ నమః
- ఓం శౌర్యే నమః
- ఓం హయగ్రీవాయ నమః
- ఓం జనార్దనాయ నమః
- ఓం కన్యాశ్రవణ తాడ్యాయ నమః
- ఓం పీతాంబర ధరాయ నమః
- ఓం అనఘాయ నమః
- ఓం వనమాలినే నమః
- ఓం పద్మనాభాయ నమః
- ఓం మృగయాసక్త మానసాయ నమః
- ఓం అశ్వారూఢాయ నమః
- ఓం ఖడ్గ ధారినే నమః
- ఓం ధనార్జన సముత్సుకాయ నమః
- ఓం ఘనసార లసన్మధ్య కస్తూరీ తిలకోజ్జ్వలాయ నమః
- ఓం సచ్చిదానంద రూపాయ నమః
- ఓం జగన్మంగళ దాయకాయ నమః
- ఓం యజ్ఞరూపాయ నమః
- ఓం యజ్ఞభోక్త్రే నమః
- ఓం చిన్మయాయ నమః
- ఓం పరమేశ్వరాయ నమః
- ఓం పరమార్థ ప్రదాయ నమః
- ఓం శాంతాయ నమః
- ఓం శ్రీమతే నమః
- ఓం దోర్దండ విక్రమాయ నమః
- ఓం పరాత్పరాయ నమః
- ఓం పరబ్రహ్మణే నమః
- ఓం శ్రీవిభవే నమః
- ఓం జగదీశ్వరాయ నమః

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి