విఘ్నేశ్వరుని స్తోత్రాలు ఇంతకు ముందు పోస్టులో తెలియజేశాను.
కేశవనామాలు ఇంకో పోస్ట్ లో వివరించడం జరిగింది.
ఇప్పుడు ఈ పోస్టులో లక్ష్మీదేవి స్తోత్రాలు కొన్ని ఇస్తున్నాను. ఇవి చదువుకుని మిగతా పూజ చేసేసుకోవచ్చును. ఈ స్తోత్రాలకి అర్ధాలు కూడ తెలియజేస్తున్నాను.
శ్రీ లక్ష్మీ స్తుతి స్తోత్రాలు
వందే పద్మకరాం, ప్రసన్న వదనాం, సౌభాగ్యదాం, భాగ్యదాం,
హస్తాభ్యాం అభయ ప్రదాం, మణి గణైర్, నానా విధైర్ భూషితామ్,
భక్తా భిష్ట ఫల ప్రదాం, హరిహర బ్రహ్మాదిభి స్సేవితాం,
పార్శ్వే పంకజ, శంఖ, పద్మ, నిధిభి ర్యుక్తాం, సదా శక్తిభి: ॥
అర్థము:
ఓ అమ్మా, లక్ష్మీ మాతా! పద్మములను పోలిన చేతులు కలిగి (పద్మము చేత్తో పట్టుకుని), ప్రసన్నమైన ముఖము కలిగి, సౌభాగ్యాన్ని, భాగ్యాన్ని ప్రసాదిస్తూ, చేతులతో అభయాన్ని కూడా అందిస్తూ, నానావిధములైన మణుల, ఆభరణములతో అలంకరింపబడిన దానివై, భక్తుల కోరికలన్నీ తీరుస్తూ, విష్ణువు, శివుడు, బ్రహ్మల చేత పూజింపబడుతూ, నీ నాల్గు పక్కల నాలుగు చేతులలో కమలము, శంఖము, పద్మము, ఐశ్వర్య సంపద ధరించి, ఎల్ల వేళలా శక్తి దాల్చిన నీకు నా పాదాభివందనములు సమర్పించు చున్నాను .
లక్ష్మీం, క్షీర సముద్రరాజ తనయాం, శ్రీరంగ ధామేశ్వరీం,
దాసీ భూత సమస్త దేవ వనితాం, లోకైక దీపాంకురాం,
శ్రీమన్ మందకటాక్ష, లభ్ద ,విభవ బ్రహ్మేంద్ర గంగా ధరాం,
త్వాం, త్రైలోక్య కుటుంబినీం, సరసిజాం, వందే ముకుంద ప్రియాం ॥
మాతర్ నమామి, కమలే, కమలాయతాక్షి ,
శ్రీ విష్ణు హృత్కమల వాసిని, విశ్వమాత,
క్షీరోదజే, కమల కోమల గర్భ, గౌరి,
లక్ష్మీ ప్రసీద, సతతం, నమతాం శరణ్యే ॥
సరసిజ నయనే, సరోజ హస్తే, ధవళతరాంశుక గంధమాల్య శోభే,
భగవతి, హరివల్లభే, మనోజ్ఞే, త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్ ||
భగవతి, హరివల్లభే, మనోజ్ఞే, త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్ ||
అర్థము:
ఓ తల్లీ, కమలముల వంటి కనులు, హస్తములు కలిగి, తెల్లని పుష్పమాలికల దండలు ధరించిన అమ్మా! ఓ భగవతీ, శ్రీహరి ప్రియసఖీ, సర్వము ఎఱిగిన తల్లీ, ముల్లోకముల లోని ప్రాణులందరినీ ఎల్లవేళలా రక్షిస్తూ ఉండు మాతా!
లక్ష్మీం, క్షీర సముద్రరాజ తనయాం, శ్రీరంగ ధామేశ్వరీం,
దాసీ భూత సమస్త దేవ వనితాం, లోకైక దీపాంకురాం,
శ్రీమన్ మందకటాక్ష, లభ్ద ,విభవ బ్రహ్మేంద్ర గంగా ధరాం,
త్వాం, త్రైలోక్య కుటుంబినీం, సరసిజాం, వందే ముకుంద ప్రియాం ॥
అర్థము:
ఓ లక్ష్మీమాత! పాల సముద్రారాజ తనయీ , శ్రీరంగక్షేత్ర ఈశ్వరీ , సమస్త భూత గణములు, దాసదాసులు, దేవ వనితలకూ, సమస్త లోకాలకు వెలుగుని ప్రసాదించే ఏకైక జ్యోతివి నీవు. నీ చల్లని కృపా కటాక్షములచే బ్రహ్మ, ఇంద్రుడు, గంగాధరుడైన శివుడు వైభవాన్ని పొందుచున్నారు. ఓ మాతా, ముల్లోక నివాసినివైన నీకు, పద్మము నుండి వెలసిన నీకు, ఇవే నా నమస్సులు ఓ ముకుందుని ప్రియసఖీ!
మాతర్ నమామి, కమలే, కమలాయతాక్షి ,
శ్రీ విష్ణు హృత్కమల వాసిని, విశ్వమాత,
క్షీరోదజే, కమల కోమల గర్భ, గౌరి,
లక్ష్మీ ప్రసీద, సతతం, నమతాం శరణ్యే ॥
అర్థము:
తల్లీ నీకు వందనములు! ఓ కమలమా! కమలములు పోలిన కనులున్న మాతా! మహావిష్ణువు హృదయము నందు నివసించే, సమస్త విశ్వానికి తల్లీ! పాలకడలి నుండి పుట్టిన, కోమలములైన కమలముల గర్భమందుండే ఓ గౌరీమాతా , ఓ లక్ష్మీదేవీ, ఎల్లవేళలా రక్షింపుము తల్లీ, నిన్నే శరణు వేడుచున్నాను.
For lyrics in English along with their meanings, please click Here
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి