వినాయకుడు విఘ్న దేవత. మనము ఏ పని అయినా ఆరంభించే ముందు విఘ్నేశ్వరుని తలుచుకుని, స్తుతించి అప్పుడు ఆ పని చేస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోతుంది. అన్ని పురాణాలూ కూడా ఈ సంగతినే చెబుతున్నాయి.
ఈ స్తోత్రాలు, శ్లోకాలు మనము చిన్నప్పటినుండి వింటున్నవే.
వినాయకునికి గణేశుడు, విఘ్నేశ్వరుడు అని ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి వాడుకలో.
వినాయకుడు అన్ని సమస్యలను అరికట్టి కార్యము విజయవంతం చేస్తాడు. అందుకనే పూజలన్నీ వినాయక స్తుతి తోనే మొదలు పెట్టడము పరిపాటి. ముందుగా మన తల్లితండ్రులని తలుచుకుని ఆ తర్వాత గురువులని తలుచుకుని అందరికీ నమస్కరిస్తూ వినాయకుని పూజిస్తాము.
వినాయక స్తోత్ర/శ్లోకములు
శుక్లాంబర ధరమ్ విష్ణుమ్ శశివర్ణమ్ చతుర్భుజమ్ |
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే || (1)
భావార్థము:
తెల్లని బట్టలు ధరించి, చంద్రుని కాంతి వలె శరీర వర్ణము కలిగి, నాలుగు భుజములతో ఎల్లప్పుడూ ఉల్లాసమైన వదనముతో ఉండు, అన్ని విఘ్నములనుండి రక్షించు ఓ విఘ్నేశ్వరా నిన్నే నేను పూజించెదను.
తొండము నేకదంతము తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలు మెల్లని చూపులు మందహాసమున్ |
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీతనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ || (2)
భావార్ధము:
విఘ్నేశ్వరుడు తొండము, ఒక దంతము, విశాలమైన బొజ్జ,ఎడమ చేతిలో బాగుగా చప్పుడు చేసే గజ్జెలు పట్టుకుని, ఒక కొండ చిన్న గుజ్జు రూపములో ఉన్నట్లుగా మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అతను చదువులన్నింటికీ అది దేవత. అటువంటి పార్వతీ పుత్రుడు మఱియును గణములన్నింటికీ అధిపతి అయిన ఓ గణేశ్వరా నీకు మ్రొక్కుచున్నాను స్వామీ, దయ చేసి నాకు విఘ్నములు, ఆపదలు లేకుండా కాపాడు తండ్రీ.

అగజానన పద్మార్కం, గజాననం, అహర్నిశం,
అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే || 3 ||
భావార్థము:
హిమవంతుని పుత్రి పార్వతీదేవి యొక్క కమల నేత్రముల నుండి వెదజల్లే కిరణములు ఏవిధముగా అయితే విఘ్నేశ్వరుని పై కటాక్షముగా ఉండునో అదేవిధంగా ఏకదంతుడైన వినాయకుని కృపాదృష్టి ఎల్లవేళలా అనేక దంతములు కలిగిన తన భక్తులపై ఉండు గాక.
ఓం నమో శ్రీ విఘ్నేశ్వరాయ నమః |
ఓం నమో శ్రీ విఘ్నేశ్వరాయ నమః |
ఓం నమో శ్రీ వినాయకాయ నమః |
ఓం నమో శ్రీ ఏకదంతాయ నమః |
ఓం నమో శ్రీ గజాననాయ నమః |
ఓం నమో శ్రీ గజాననాయ నమః |
ఓం నమో శ్రీ గణేశాయ నమః ||
ప్రతిరోజూ మనం చేసే పూజని పైన చెప్పబడిన శ్లోకాలు స్తోత్రాలతో మొదలు పెట్టవచ్చును.
ప్రతిరోజూ మనం చేసే పూజని పైన చెప్పబడిన శ్లోకాలు స్తోత్రాలతో మొదలు పెట్టవచ్చును.