27, నవంబర్ 2024, బుధవారం

గోవింద నామావళి - 108 Names of Lord Krishna/Sri Venkateswara Swamy


గోవింద నామావళి అన్నది వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించి కీర్తించే 108 నామాలు అన్నమాట. 
కానీ గోవిందుడు అంటే మరి కృష్ణుని నామము కదా! మరి వెంకటేశ్వరుని నామాలు ఎలా అయ్యాయి అని అంటారా ? కృష్ణుడూ , వెంకటేశ్వరుడు కూడ శ్రీహరి రూపాలే అని మీకు తెలుసు కదా మరి. 

అంతేకాదు. ఈ నామాలు చదువుతున్నప్పుడు మీకు శ్రీ రాముని, ఇంకా మిగతా విష్ణు రూపాలనీ కూడ మనము కీర్తిస్తున్నామని అర్థం అవుతుంది. అంటే వెంకటేశ్వర స్వామి లోనే అందరు దేవుళ్ళని మనము చూస్తున్నాం అని గ్రహించాలి. 

ఇవి ఎనిమిదేసి నామాల గుత్తులుగా తయారుచేశారు. ఇవి ఎవరు రాశారో సరిగ్గా తెలియదు.
 
ప్రతీ ఎనిమిది నామాల తరువాత (అంటే ఎనిమిది వరుసల తరువాత) గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా అని ఉంటుంది . దీన్ని రెండు సార్లు చదవాలి ప్రతి ఎనిమిది వరుసల తరువాత.  అలా రాగ యుక్తంగా చదువుతూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. 

నేను ప్రతీ శనివారము దీన్ని చదువుతున్నాను ఎన్నో ఏళ్ల నుండి. దీన్ని నాకు కాకినాడ దగ్గరి పల్లెటూర్లో కళ్యాణ వేంకటేశ్వరస్వామి గుడిలో చాలా ఏళ్ళక్రితం ఇచ్చారు. శనివారాలు తప్పకుండా చదువుతూ ఉండమని చెప్పి ఇచ్చారు. 

నాకు ఇచ్చిన కాపీలు పంచి పెట్టిన వారి పేరు ముద్రించి ఉంది. అది శ్రీమతి సవితా రాణి, బాలకృష్ణా రెడ్డి గార్లు పంచి పెట్టారు.  

కొన్ని నామాలకి అర్థము కూడ తెలియజేస్తే మంచిదనిపించింది. అలా అవసరము అనిపించిన నామాలకి అర్థము ఇస్తున్నాను. 

గోవింద నామావళి   


ముందుగా మూడు సార్లు "ఓం గోవిందాయ నమః" అని చెప్పుకోండి. 

శ్రీ శ్రీనివాసా గోవిందా 
శ్రీ వెంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా (భక్తుల మీద ఆప్యాయత కలవాడు)
భాగవతప్రియ గోవిందా (తనకు కైంకర్యము చేసే వారికి ఇష్టమైన వాడు)
నిత్యనిర్మలా గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుషా గోవిందా
పుండరీకాక్షా గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా | 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

నందనందనా గోవిందా (నందుని కొడుకు)
నవనీతచోరా  గోవిందా (వెన్నల దొంగ)
పశుపాలక శ్రీ గోవిందా
పాపవిమోచన గోవిందా 
దుష్టసంహారా గోవిందా
దురితనివారణ గోవిందా (చెడు మరియు దుర్మార్గములను పోగొట్టేవాడు)
శిష్టపరిపాలక గోవిందా
కష్టనివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా | 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

వజ్రమకుట ధర గోవిందా (వజ్ర కిరీటము కలవాడు)
వరాహమూర్తి గోవిందా (వరాహ అవతారుడు)
గోపీజనలోల గోవిందా (గోపీజనులతో ఉండేవాడు)
గోవర్ధనోద్హారా గోవిందా (గోవర్ధన పర్వతము ఎత్తాడు ఇంద్రుడి కోపం తుఫానుల నుండి రక్షిస్తాడు)
దశరథనందన గోవిందా 
దశముఖమర్దన గోవిందా (పది తలల రావణుని చంపాడు)
పక్షివాహన గోవిందా  (గరుడ పక్షి వాహనముగ కలవాడు)
పాండవప్రియా గోవిందా 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా | 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

మత్స్యకూర్మా గోవిందా (మత్స్య అవతారము , కూర్మ అవతారము ఎత్తాడు)
మధుసూదన హరి గోవిందా (మధు అనే రాక్షసుని దండించాడు)
వరాహనరసింహ గోవిందా (వరాహ మరియు నారసింహ అవతారాలు దాల్చాడు)
వామనభృగురామ గోవిందా (వామనుడిగా, భృగు మహర్షి కొడుకు పరశురామునిగా ) 
బలరామానుజ గోవిందా (బలరాముడు సోదరుడుగా కలవాడు)
బౌధ్హకల్కిధర గోవిందా (బుద్హావతారము, కల్కి అవతారము దాల్చినవాడు) 
వేణుగానప్రియ గోవిందా (కృష్ణుడు)
వేంకటరమణా గోవిందా (వేంకటేశ్వరుడు)
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా | 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

సీతానాయక గోవిందా 
శ్రితపరిపాలక గోవిందా 
దరిద్రజనపోషక గోవిందా 
ధర్మసంస్థాపక గోవిందా 
అనాధరక్షక గోవిందా 
ఆపద్భాంధవ గోవిందా 
శరణాగత వత్సల గోవిందా 
కరుణాసాగర గోవిందా
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా | 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

కమలదళాక్ష గోవిందా 
కామితఫలదాతా గోవిందా (కోరికలు దీర్చేవాడు)
పాపవినాశక గోవిందా (పాపాలు పోగెట్టేవాడు)
పాహిమురారే గోవిందా (రక్షించు మురాసురుని చంపినవాడా)
శ్రీముద్రాంకిత గోవిందా (శ్రీముద్ర అంటే నుదిటి పై బొట్టు ఉన్నవాడు)
శ్రీవత్సాంకిత గోవిందా (శ్రీవత్స చిహ్నము ఉన్నవాడు)
ధరణీనాయక గోవిందా (ధరణి అంటే భూమి మరియు భూదేవి)
దినకరతేజా గోవిందా (సూర్యుని తేజస్సు కలవాడు)
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా | 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

పద్మావతిప్రియ గోవిందా 
ప్రసన్నమూర్తీ గోవిందా 
ఆశ్రితపక్షా గోవిందా 
అభయహస్తప్రదర్శన గోవిందా 
శంఖచక్రధర గోవిందా 
శార్ఙ్గగదాధర గోవిందా 
విరజాతీరస్థ గోవిందా (తిరుపతిలో వేంకటేశ్వరుని పాదాల కింద నీరు ఉంటాయి. అదే విరజా నది)
విరోధిమర్దన గోవిందా (విరోధులను చంపేవాడు)
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా | 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

సాలగ్రామధర గోవిందా  (సాలగ్రామము అనేది ఒక పవిత్రమైన రాతి శిల (ఉండ లాంటి ముక్కలు. అది పూజింపబడుతుంది దేవునితో సమానంగా)  
సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా 
లక్ష్మణాగ్రజ గోవిందా 
కస్తూరి తిలకా గోవిందా 
కాంచనాంబర ధర గోవిందా (కాంచనము అంటే బంగారము. బంగారు దుస్తులు ధరించినవాడు)
గరుడవాహన గోవిందా 
గజరాజ రక్షక గోవిందా   
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా | 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

వానర సేవిత గోవిందా 
వారధి బంధన గోవిందా 
ఏడుకొండలవాడ గోవిందా 
ఏకస్వరూప గోవిందా 
శ్రీరామకృష్ణ గోవిందా 
రఘుకులనందన గోవిందా 
ప్రత్యక్షదేవా గోవిందా 
పరమ దయాకర గోవిందా 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా | 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

వజ్రకవచ ధర గోవిందా 
వైజయంతిమాలా గోవిందా 
వడ్డికాసులవాడ గోవిందా 
వాసుదేవతనయ గోవిందా 
బిల్వపత్రార్చిత గోవిందా 
భిక్షుక సంస్తుత గోవిందా 
స్త్రీ పుం రూపా గోవిందా 
శివకేశవ మూర్తీ గోవిందా 
బ్రహ్మాండ రూపా గోవిందా 
భక్త రక్షక గోవిందా 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా | 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

నిత్య కళ్యాణ గోవిందా 
నీరజనాభా గోవిందా 
హాతిరామప్రియ గోవిందా (హాతిరామ్ ఒక పరమ భక్తుడు)
హరిసర్వోత్తమ గోవిందా 
జనార్ధనమూర్తి గోవిందా 
జగత్ సాక్షిరూప గోవిందా 
అభిషేక ప్రియ గోవిందా 
ఆపన్నివారణ గోవిందా 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా |  
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

రత్నకిరీటా గోవిందా 
రామానుజసుత గోవిందా (రామానుజుల వారు వేంకటేశ్వరునికి యజ్నోపవీతం చేసి, శంఖ చక్రములు ధరింపచేశారు. అందుచేత వెంకటేశ్వర స్వామి ఆయన కొడుకు అయ్యాడు)
స్వయంప్రకాశ గోవిందా 
సహస్రాక్షా గోవిందా 
నిత్యశుభ ప్రద గోవిందా 
నిఖిల లోకేశా గోవిందా 
ఆనందరూపా గోవిందా 
ఆద్యంత రహితా గోవిందా 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా | 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

ఇహపర దాయక గోవిందా (ఇహము అంటే భూలోక సుఖములు, పర అంటే స్వర్గ సుఖాలు)
ఇభరాజ రక్షక గోవిందా  (ఇభ అంటే ఏనుగు. గజేంద్రుని రక్షించిన వాడు)
పరమ దయాళో గోవిందా 
పద్మనాభ హరి గోవిందా 
తిరుమల వాసా గోవిందా 
తులసీ వనమాలా గోవిందా 
శేషాద్రి నిలయ గోవిందా 
శేష శాయిని గోవిందా 
శ్రీ శ్రీనివాస గోవిందా 
శ్రీ వెంకటేశ గోవిందా 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా | 
గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా || 

శ్రీ ఏడుకొండల వాడా, వేంకటరమణా, గోవిందా, గోవిందా, గోవింద || 

For the English version of Govinda NaamaavaLi, please visit this link.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి