కరోనా వైరస్ ఒక విధమైన సూక్ష్మ జీవి లాంటిది. అందులో అనేక వర్గాలు ఉన్నాయి. ప్రస్తుతము ప్రపంచము అంతటా వ్యాపించి భయపెడుతున్నది ఒక విధమైన సూక్ష్మ కణము ఏదైతే జంతువుల నుండి మనుషులకి సంక్రమించే వ్యాధి అయి ఉండవచ్చునని వైజ్ఞానికుల అనుమానము. ఇది చైనా లో మొదటిసారిగా 2019 చివరి నెలలలో గుర్తించబడింది అనీ అక్కడినుండి ఇతర దేశాలకు వ్యాపించిందనీ అనుమానము. అందుకని ఈ వ్యాధి పేరు కరోనా వైరస్ వ్యాధి- 2019 అని పేరు పెట్టారు.
COVID-19 లక్షణములు
కరోనా వైరస్ వ్యాధి 2019 సోకిన వ్యక్తి లక్షణములు ఈ క్రింద చెప్పబడిన విధముగా ఉండవచ్చునని వైద్య శాస్త్రజ్ఞుల అభిప్రాయము.
పైన పేర్కొన్న వారందరూ కూడ వెంటనే తమ వైద్యులని కలుసుకుని ఈ వ్యాధికి పరీక్ష చేయించు కోవాలి. ఆ డాక్టర్ చెప్పిన విధముగా తప్పక చేయాలి.
- ఏ వ్యక్తి అయితే ఈ వ్యాధి సోకడానికి ముందటి 14 రోజులలో విదేశ యాత్ర చేసి ఉండునో
- ఏ వ్యక్తి అయితే ఈ వ్యాధి సోకడానికి ముందటి 14 రోజులలో వ్యాధి సోకిన వ్యక్తికి సన్నిహితముగా ఉన్నాడో
- ఏ వ్యక్తి అయితే పైన పేర్కొన్న వారితో కొంత సంపర్కము కలిగి, జ్వరము లేక ఊపిరి బాధలతో (ఊపిరి పీల్చుకోడములో గాని, దగ్గూ జలుబులతో) భాధ పడటం గాని జరుగుతోందో
- సంఘ సేవలో కాని సమాజ సేవలో కానీ తిరుగు సమయంలో పైన చెప్పబడిన వ్యక్తులతో సంపర్కము ఏర్పడి శ్వాసకోశ బాధలతో ఉన్నచో
- సంఘ సేవ, వైద్య సేవలలో తిరుగు వ్యక్తులు ఈ పైన చెప్పబడిన ఏ ఒక విధమైన వర్గం లోకి చెందిన వ్యక్తితో నైనా సన్నిహిత సంపర్కములో ఉండి ఉన్నట్లయితే
సన్నిహిత సంపర్కము (Close Contact Meaning)
సన్నిహిత సంపర్కము అనగా దగ్గరలో ఉండుట.
ఈ వ్యాధి లక్షణములు కలిగిన మనిషికి 3, 4 అడుగుల దూరములో ఉంటే అది సన్నిహిత సంబంధము అవుతుంది. లేదా అట్టి వ్యక్తిని తాకినా లేదా అతని వస్తువులను ముట్టుకున్నా కూడ అది సన్నిహిత సంపర్కమే అవుతుంది. కాబట్టి అటువంటి వారందరూ కూడా ఈ పరీక్ష చేయించుకోవాలి తప్పకుండా.
COVID 19 తీసుకొన వలసిన జాగ్రత్తలు
- ఈ వ్యాధి నుండి కాపాడుకొనుటకై తరచుగా చేతులు కడుక్కొన వలయును. ముఖ్యంగా బయటి నుండి ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడల్లా. సబ్బుతో కడుక్కుంటే ఇంకా మంచిది.
- నోటికి, ముక్కుకి ఏదైనా కప్పుకుని బయటకు వెళ్ళుట మంచిది. కనీసము రుమాలు పెట్టుకో వలయును.
- దగ్గినా, తుమ్మినా రుమాలు అడ్డు పెట్టుకుని చేయవలెను.
- కన్ను, ముక్కు, నోరు వీటిని ముట్టుకోకుండా ఉంటె మంచిది. లేదంటే మీ చేతి క్రిములు వాటికి పట్టుకునే ప్రమాద ముండవచ్చును.
- బయటి మనుషులకి 3, 4 అడుగుల దూరంగా ఉంటే మంచిది. అంటే సన్నిహిత సంపర్కము లేకుండా చూసుకోవాలి.
- ఏవైనా పైన చెప్పబడిన కానీ ఇంకేమైనా కానీ అనారోగ్య సమస్యలుంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్లి ఆయన చెప్పినట్లు ఉండాలి. చేయాలి కూడ.
- మానసిక ఆవేదనలకు, లేని పోని భయాలకు గురి కాకుండా సమయాన్ని సదుపయోగం చేసుకుంటూ, ఇతరులకు ధైర్యము చెప్పుతూ ప్రశాంతముగా ఉండాలి.